Tuesday, November 29, 2011

మౌస్ క్లిక్

మౌస్ క్లిక్ 


ఒక రోజు నేను కంప్యూటర్ లాబ్ లోకి వచ్చి కూర్చున్నాను. కొత్తగా ఒక అమ్మాయి c language programming చేస్తొంది. అది turbo c dos based. ఇంతలో screen పైన ఒక మెసెజ్ వచ్చింది. your time is up please vacate the system అని. మామూలుగా ఎదైనా మెసేజ్ వస్తె dos క్లోస్ అయ్యిపోయి windows screen వచ్చెస్తుంది కదా. ఆ అమ్మాయి కంగారుగా నన్ను అడిగింది. సార్ నేను చేసిన c language program close అయ్యిపొయింది మెసేజ్ వచ్చేసింది నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది.  నేను ఏమి లేదమ్మా ok button ఉంది కదా దానిపైన mouse click చేయి అని చెప్పాను. దానికి ఆ అమ్మాయి mouse ని తన చేతిలో తీసుకుని గాలిలో లేపి computer screen మీద ok button ఉన్న చోట పెట్టి నొక్కేస్తుంది. నేను ఒక్క సారిగా shock కి గురయ్యాను. ఆ తరువాత mouse click ఎలా చేయాలో నేర్పించి , నవ్వు ఆపుకోలేక staff room లోకి వెళ్ళి పగలపడి నవ్వాను.  

Sunday, November 27, 2011

Search Engine



ఇది చాల సంవత్సరాల క్రితం ఒక T.C.S మిత్రుడు చెప్పిన యథార్థ సంఘటన 

ఒకసారి T.C.S వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కాంపస్ ఇంటర్వూలో కొంతమందిని recruit చేసుకున్నారంట. అందులో B.Tech Mechanical చేసిన అతనికికూడా software engineer గా job వచ్చింది. programming లొ అతనికి ఎదో doubt వచ్చింది. తన Team Leader ని doubt ని అడిగాడు. అతను busy గా ఉండటం వలన search engine లొ type చెయమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక చూడండి మనోడు మొత్తం building అంతా వెతికేసాడంట. చివరకి Team Leader దగ్గరకి వెళ్ళి సార్ మీరు చెప్పిన search engine కోసం ఈ building అంతా వెతికాను కాని నాకు ఎక్కడా కనపడలేదు ఆ engine ఏ floor లో ఉంది సార్ అని అడిగాడంట. ఈ దెబ్బకి Team Leader కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిపోయిందంట. కొంచెం సేపు తరువాత తేరుకుని. బాబూ అది mechanical engine కాదు. మీ browser లొ yahoo.com అని టైప్ చేసి నీకిచ్చిన Topic టైప్ చేయి అని చెప్పాడంట. 

Saturday, August 27, 2011

బ్లూస్క్రీన్ ఆఫ్ డెత్







నేను classroom లో క్లాసు చెబుతున్నాను. students అందరూ ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తున్నారు. ఒక అమ్మాయి తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమె నా student కూడా కాదు. excuse me sir అని పలుకరించింది. నేను బయటకు వచ్చి ఎవరు కావాలని అడిగా. సార్ మీ పేరు bhaskar కదా systems administrator కూడా కదా అని చెప్పింది. నేను అవును అన్నాను. సార్ మిమ్మలని కలవమని నాకు message పంపించారెంటి సార్ అని చెప్పింది. ఒక్కసారిగా కంగు తిన్నాను.  నేనా లేదు నేను పంపించలేదు అని చెప్పాను. లేదు సార్ మీరే పంపించారు. నేను చూడమ్మ నేను ఒక గంట నుండీ class చెబుతున్నాను    నీవేమో నేను message పంపించానంటున్నవు. అని చెప్పాను. లేదు సార్ మీరే పంపించారు  
Blue screen పైన yellow letters లో contact your systems administrator అని Message వచ్చింది అందుకే మిమ్మలను కలవడానికి వచ్చాను. 


ఆఆఆ


నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. నేను ఆమె తో ఆ system ఆపేసి పక్క system తీసుకోండి అని చెప్పాను. 





Thursday, August 25, 2011

డాక్టర్ వాట్సన్




ఒక రోజు మా కొలీగ్ lab లొ క్లాసు చెబుతున్నాడు. అది computer fundementals. అందరూ కాస్త age ఎక్కువ ఉన్నవాళ్ళె. ఒక విధ్యార్థి లండన్ లో వైద్యుడు గా పని చేస్తున్నారు. ఇక్కడ ఎదో పని మీద India వచ్చి వారం రోజుల పాటు computer fundementals course జాయిన్ అయ్యారు. ఏవో medical books ఉన్నాయని ఒక floppy తీసుకుని వచ్చారు. drive లొ పెట్టగానే Dr. Watson ఎర్రర్ వచ్చింది. అది చూసి ఆయన గబగబ వెళ్ళిపోతున్నారు. నేను ఆయనను ఆపి ఏమిటి సార్ అలా వెళ్ళి పోతున్నారు అని ఆడిగాను. సార్ ఇక్కడ దగ్గరలో ఎమైనా I.S.D ఉందా, నేను లండన్ కి call చేసి, అక్కడ మా department హెడ్ Dr.Watson తో మాట్లాడాలి. floopy ఎల ఓపెన్ చెయ్యాలో  కనుక్కొవాలి అని అన్నారు. సార్ మీ doctor గారికి దీనికి సంబందం లేదు. ఇది computer లో వచ్చె ఒక చిన్న సమస్య నేను rectify చేస్తాను అని చెప్పాను దానికి ఆయన శాంతించి మరలా class లో కూర్చున్నారు.

మేము మాత్రం తెగ నవ్వుకున్నాము

year : 2000

Wednesday, August 24, 2011

csharp and java


డిలీట్


ఒకరోజు నేను ఆప్టెక్ లో సి లాంగ్వేజ్ క్లాసు చెబుతున్నాను. అందరూ కొత్తవాళ్ళు. కంప్యూటర్ గురించి అస్సలే తెలియదు. ఎలాగోలా కష్టపడి ఫ్రోగ్రాంస్ టైప్ చేస్తున్నారు. క్లాసు చెప్పిన తరువాత లాబ్ లోకి వెళ్ళాను. ఒక అమ్మాయి చాల నెర్వస్ గా ఫీల్ అవుతూ ఉంది. నేను ఏంటమ్మ అలా ఉన్నావు అని ఆడిగా. దానికి ఆమె సార్ నేను నిన్నంతా కష్టపడి 5 ప్రోగ్రాంస్ టైప్ చేసాను. కాని అవి కనిపించడం లేవు సార్ అని చెప్పింది. నేను సిస్టం అంతా సెర్చ్ చేసాను. నాకు కూడా ఎక్కడా కనపడలేదు . నేను మళ్ళీ అడిగా ఎక్కడ సేవ్ చేసారు అని. ఎవరికి కనిపించకూడదని రీ సైకిల్ బిన్ లో పెట్టాను సార్ అని.

ఆఆఆఆ

కాని అప్పటికే అవి డిలీట్ అయిపోయాయి