పర్వతాలు అడ్డు వస్తే ఫుట్ బాల్ ఆడి
చంద్ర మండలానికి పంపిస్తాడు.
సూర్యున్ని చేతిలో బంధించి
చీకటిని,చంద్రుణ్ణి తెప్పిస్తాడు .
చీకటిని తన చేతిలో బంధించి
మనకు వెలుగు ప్రసాదిస్తాడు.
మహాసముద్రాన్ని తను రుచి చూసి
మనకు వానలు ప్రసాదిస్తాడు.
ఆకాశం లో రంగులు వేసి
ఇంద్రధనస్సు సృష్టిస్తాడు.
తెలుగు సినీ నక్షత్రాలను బంతిగా చేసి
పాల పుంతలను దాటిస్తాడు .
తన నటనతో తెలుగు సినిమా
ఎప్పుడూ చూడని సునామి సృష్టిస్తాడు.
అతనే మా థండర్ స్ట్రార్ సంపూర్నేష్ బాబు.
మా థండర్ స్టార్ సంపూర్నేష్ బాబుకి మనస్పూర్తిగా ఈ కవిత అంకితం ఇస్తున్నాను.
ఇట్లు : భాస్కర్ (సంపూ బాబు వీరాభిమాని)
7 comments:
baboi ! evarandee eeyana ? ekkada choosina eeyanea kanipistunnaru ?
maa sampu ki veeraabhimaanula premakee mem baanisalam...
సుజాత గారు నాకు నిన్ననే ఈ సంపూర్నేష్ గురించి తెలిసిందండి. చాలా మంది కవులు హీరోల కొడుకుల గురించో , వారి కొడుకుల కొడుకుల గురించో తెగ పొగిడేసి పాటలు రాసేస్తారు కదండి. ఎదో ఈ సంపూర్నేష్ పొగుడుతూ నేను కూడా కవిత రాసాను.
ఈ సంపూర్నేష్ ఇప్పుడున్న హీరోలకు సెటైర్ అయితే నా కవిత కూడా ఇప్పుడు వస్తున్న పాటలకు సెటైర్ అనుకొండి.
తాతా వారు మనందరం సంపూ బాబు ప్రేమకు బానిసలం.
కత్తి మహేష్ గారు ఈ సినిమా లో పని చేస్తున్నారు. ఆయన సినివిశ్లేషణలు చాలా చదివాను. హృదయ కాలేయం సినిమా ఇప్పుడున్న సినిమాల పైన సెటైర్ అనుకుంటున్నాను.
హాయ్ భాస్కర్ గారు, నేను స్టీవెన్ స్పీల్ బర్గ్ హాలీవుడ్ నుండి ఈ కామెంట్ రాస్తున్నాను. మా కొత్త మూవీ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కు మీ కవితను తీసుకుని పాటగా చేసుకోవచ్చా ? ప్లీజ్ .
స్పీల్ బర్గ్ గారు నేను హాలీవుడ్ సినిమాలకు రాయనండి. మొన్ననే జేమ్స్ కామెరాన్ గారు కూడా అడిగారు. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తప్ప హాలీవుడ్ కు రాయనండి.
అది కూడా మా సంపూ బాబు సినిమాలైతే ఓ.కే.
ఇదేదో హాస్యానికి బాగానే ఉన్నట్లుంది గాని నిజం చెప్పాలంటే ఆ ష్ట్ర్రార్ పేరయినా నేను వినలేదు కాని వీరారాధన మంచిదికాదంటారు పాత పెద్దలు ఈలాంటి వీరాభిమానులు మా కవులుకూడా సంపాదించుకుంటే అది కూడా బాగానే ఉండేటట్లు ఉందండోయ్!
సూర్య ప్రకాష్ గారు, ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియ చేసినందుకు.
నా అబిప్రాయం ప్రకారం సంపూర్నేష్ అందరి హీరోల పైన సెటైర్ వేస్తున్నాడు.
చూడండి.
మహేష్ బాబు - సంపూర్నేష్ బాబు
ముద్దు పేర్లు బన్ని,చెర్రి - తనది సంపూ ముద్దు పేరు
పవనిసం (పవన్ కళ్యాణ్ ది) - సంపూర్నిసం తనది
ఇంకా చెప్పాలంటే రాష్ట్ర సంపూర్నేష్ యువత లాంటి సంఘాలు.
ఫేస్ బుక్ ని , twitter ni తెగ వాడుకుని ఫాలోయింగ్ (మంచి,చెడూ) తెచ్చుకున్నాడు.
ఇదొక రకమైన పబ్లిసిటి ( వారు నిజంగా సినిమా తీస్తే )
కవులకు కూడా వీరాభిమానులు ఉంటే బాగుండు అన్నారు. అది మన ఆంద్రప్రదేశ్ లో జరగదు సార్.
తెలుగు భాష పైనే గౌరవం లేదు. కవులకు వీరాభిమానులు ఉండడం అత్యాశ అవుతుందేమో.
Post a Comment