Saturday, January 7, 2012

సైకోథెరపిస్ట్

ఒక సైకోథెరపిస్టు తన వ్యాపారం బాగుండాలని నగరం నడి బొడ్డున ఒక బేనర్ రాయడానికి ఒక పైంటర్ కి పురమాయించాడు. ఆ పైంటర్ పని పూర్తిచేసాడు కాని అప్పటి నుండి తన ప్రాక్టీసు పడి పోయింది. ఆ డాక్టరు గారికి ఏమి అర్థం కాలేదు అందరికీ కనపడాలని బానెర్ రాయించితే వ్యాపారం పెరగాలి కాని ఇలా జరింగింతేంటబ్బా అని ఎందుకైనా మంచిదని దానిని చూడటానికి వెళ్ళాడు. అది చూసి తనే సొమ్మసిల్లి పోయాడు .






















































ఇంకా కిందకు చూడండి













































Tuesday, January 3, 2012

V.V.I.P Pass


మా ఇంటి దగ్గర ఒక తెలిసిన ఆయన ఉన్నాడు. కొత్తగా ఒక ఆఫీసు లో జాయిన్ అయ్యాడు. అప్పుడే C.C.L క్రికెట్ మాచ్ లు జరుతున్నాయి. నాకు మా తమ్ముడికి వాళ్ళ బాస్ ని అడిగి 500 rs passes ఇచ్చాడు. మా తమ్ముడికి  క్రికెట్ మాచ్ లు అంటే మహా సరదా. కాని నాకు అంతగా ఇష్టం లేదు. అందులోనూ సినిమా యాక్టర్స్ ఆడే మాచ్ లు ఏమి చూస్తాము? క్రికెట్ అంటే professionals ఆడితేనే మజా అనుకుని నా పాస్ కూడా మా తమ్ముడుకే ఇచ్చేసాను. వాడు తన స్నేహితుడిని తీసుకు వెళ్ళాడు. మీకు పాస్ ఏది అని మా పక్కింటి ఆయనను అడిగాను. దానికి ఆయన భాస్కర్ గారు మా మేడం చాలా మంచి వాళ్ళండి. నాకు special pass ఇస్తారంట అని చెప్పాడు. అబ్బో మంచి చాన్స్ కొట్టారన్న మాట అని అన్నాను. దానికి ఆయన ముసిముసిగ నవ్వు కున్నాడు. 


మాచ్ అయిన తరువాత రోజు నాకు కనిపించాడు. భాస్కర్ గారు నా జన్మ ధన్యం అయిపొయిందండీ డైరెక్ట్ గా heros రూం లోకి వెళ్ళినా నన్ను ఏమి అనలేదు. ఆ పాస్ మెడలో వేసుకుని ఎక్కడికైనా తిరగొచ్చు అని మా మేడం చెప్పారు. నేను కొద్దిగా జలెసీ ఫీల్ అయ్యాను . cricket match కి వచ్చిన అందరి హీరోలని దగ్గర గా అతను చూసినందుకు.
చాల సంతోషం అండీ అని మనసులో ని బాదను బయటకు చెప్పకుండా అభినందించాను. ఇంతకీ ఆ pass ఏమిటో నాకు కూడా చూపిస్తారా అని కుతూహలం గా అడిగాను. దానికి ఆయన తప్పకుండా అని ఇంటిలోకి వెళ్ళి pass తీసుకుని చూపించాడు. చూడటానికి చాల పెద్ద బాడ్జీ లా ఉంది. ఒక్క సారి దానిని చూడగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమి రాసుందో తెలుసా HOUSE KEEPING అని. వెంటనే పరుగెట్టి పారిపోయి మా ఇంటిలో తలుపులు అన్ని వేసుకుని వికట్టా హాసం గా నవ్వు కున్నాను. 


వాళ్ళా మేడం ఏదో V.I.P పాస్ ఇస్తారను కుంటే House keeping pass ఇస్తారా? హమ్మ 


కాని మా వోడికి ఇంకా తెలీదు House keeping అర్థం ఏమిటో......