Saturday, May 25, 2013

ఈ కవిత సంపూర్నేష్ బాబు గారికి అంకితం



పర్వతాలు అడ్డు వస్తే ఫుట్ బాల్ ఆడి 
చంద్ర మండలానికి పంపిస్తాడు. 
సూర్యున్ని చేతిలో బంధించి 
చీకటిని,చంద్రుణ్ణి తెప్పిస్తాడు .
చీకటిని తన చేతిలో బంధించి 
మనకు వెలుగు ప్రసాదిస్తాడు.
మహాసముద్రాన్ని తను రుచి చూసి
మనకు వానలు ప్రసాదిస్తాడు.
ఆకాశం లో రంగులు వేసి 
ఇంద్రధనస్సు సృష్టిస్తాడు. 
తెలుగు సినీ నక్షత్రాలను బంతిగా చేసి 
పాల పుంతలను దాటిస్తాడు .
తన నటనతో తెలుగు సినిమా 
ఎప్పుడూ చూడని సునామి సృష్టిస్తాడు.
అతనే మా థండర్ స్ట్రార్ సంపూర్నేష్ బాబు.

మా థండర్ స్టార్ సంపూర్నేష్ బాబుకి మనస్పూర్తిగా ఈ కవిత అంకితం ఇస్తున్నాను. 

ఇట్లు  : భాస్కర్ (సంపూ బాబు వీరాభిమాని)



Thursday, May 23, 2013

హృదయ కాలేయం - A Kidney With a Heart

త్వరలో మీ ముందుకు రాబోతుంది ...

హీరో -సంపూర్నేష్
డైరెక్టర్ - స్టీవెన్ శంకర్





జీ 24 గంటల వారు తీసుకున్న మరిచిపోలేని ఇంటర్వ్యూ


Sampoornesh will become the next SamAnderson,PowerStar Srinivasan of Tamil Nadu


Tuesday, April 16, 2013

జపనీస్ - ఇండియన్






జపనీస్ ఇంజనీరింగ్ విద్యార్ది ఒకడు ఇండియన్ ఇంజనీరింగ్ విధ్యార్ది తో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు.

జపనీస్ : మేము మా దేశంలో సెమిష్టర్ మొదలు పెట్టినప్పటి నుండీ, మేము రోజుకు 12 గంటలు చదువుతాము.

ఇండియన్ : మేము రోజుకు 24 గంటలూ , వారానికి 7 రోజులూ , సంవత్సరానికి 2 వారాలు చదువుతాము. ఎందుకంటే మాకు సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అది కూడా పరిక్షల ముందు. 

జపనీస్ : ఆ.......

Sunday, April 14, 2013

పావ్ లోవ్ కండిషనింగ్ రెస్పాంస్









నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను ఇంటర్నేట్ సెంటర్ నడుపుకుంటున్నాడు. చాలా మంచి మనిషి.  ఒక సారి అతను ఇంటిలో ఒక ఫంక్షన్ జరిగింది. చాలా స్వీట్లు మిగిలి పోయాయి. అతని స్నేహితుడి కూతురు ఇంటర్నెట్ సెంటర్ కి వచ్చింది. వయసు 4 సంవత్సరాలు ఉంటాయి. తను ఒక స్వీట్ ఇచ్చాడు. రేపు మరలా వస్త్తే మరొక స్వీట్ ఇస్తాను అని  చెప్పాడు. ఇల్లు దగ్గరే ఉండటం వలన రోజూ వస్తుండేది. ప్రతిరోజూ ఒక స్వీట్ ఇస్తుండేవాడు. ఒక రోజు తన దగ్గర ఉన్న స్వీట్స్ అన్ని అయిపోయాయి. ఆ అమ్మాయి వచ్చి స్వీట్ అడిగేది, మహా మంచితనం వలన షాపు లో స్వీట్ గాని చాక్లేట్ గాని కొని ప్రతిరోజూ ఇచ్చేవాడు. ఒక రోజు నేను ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్ళాను. నాకు ఈ జరిగిన విషయం అంతా చెప్పాడు. ఎలాగయినా స్వీట్ అలవాటును మాన్పించాలని అడిగాడు. ఒహ్ అదెంత అని నాకు తెలిసిన పావ్ లోవ్ ప్రవర్తనా సిద్దాంతం గురించి చెప్పాను. 

పావ్ లోవ్ అనే రష్యన్ Physiologist  ( Psychologist  కాదు) ఒక ప్రయోగం చేసి దాని ప్రకారం  ఒక ప్రవర్తనా సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక కుక్కను సబ్జెక్ట్ గా తీసుకున్నాడు.  లంచ్ టైం కి బోజనం ప్లేటు పెట్టి , ఒక గంట కొట్టేవాడు. గంట కొట్టగానే కుక్క పరిగెత్తుకుని వచ్చి ఆహారాన్ని తినేది . ఇలా చాలా రోజులు జరిగింది. గంట శబ్దం వినపడగానే కుక్క నోటిలో లాలాజలం ఊరేది.  ప్రతి సారి గంట కొట్టడం బోజనం పెట్టడం. ఇంక ఆ కుక్కకి డాక్టర్ గంట కొడితే తిండి పెడతాడని అర్థం అయిపోయింది. 

కొన్ని రోజుల తరువాత , ఆ డాక్టర్ గంట కొట్టేవాడు, కుక్క పరిగెత్తుకుని వచ్చేది. కుక్క నోటిలో లాలాజలం ఊరేది, కాని బోజనం పెట్టేవాడు కాదు. ఇలా చాలా రోజులు జరిగింది.

ఈ సారి గంట కొట్టినా కుక్క వచ్చేది కాదు. ఈ వెదవ డాక్టర్ నాకు బోజనం పెట్టడు అని అర్థం అయిపోయి ఇక వెళ్ళేది కాదు. ఇలా ప్రయోగం చేసి ప్రవర్తనా సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. 

ఈ సిద్దాంతాన్ని నేను ఆ అమ్మాయి స్వీట్లు అడగడం మాన్పించడానికి అప్లయ్ చేసాను.  ఆ అమ్మాయి వచ్చేది. స్వీటు అడిగేది. మా ఫ్రెండు ఏమి చెప్పేవాడంటే నీవు రేపు వస్తే స్వీట్ ఇస్తాను అనేవాడు. ఆ అమ్మాయి తరువాత రోజు వచ్చేంది. మరలా రేపు రమ్మనేవాడు. ఇలా చాలా రోజులు జరిగింది. పట్టు వదలని విక్రమార్కుడు లా ప్రతిరోజూ వస్తూనే ఉండేది. కాని స్వీట్ ఇచ్చేవాడు కాదు. ఆ అమ్మాయిని అలా ఏడిపించడం తప్పు అని తెలుసు కాని తప్పదు. 

కొన్ని రోజుల తరువాత రావడం మానేసింది. ఇక స్వీట్లు ఇవ్వడు అని తెలిసి. 

చాలా నెలలు తరువాత ఒకసారి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గారితో వచ్చింది. ఏమ్మా నీకు స్వీటు కావాలా అని మా స్నేహితుడు  అడిగాడు. ఆ అమ్మాయి చిరాకు మెహం పెట్టి వద్దు అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయింది. 






Friday, April 12, 2013

విజయకాంత్ కామెడి

 బులెట్ రిఫ్లెక్ట్ బిళ్ళ


కరెంటు కే షాకు ఇవ్వగల సూపర్ మేన్


డాక్టర్ విజయ్ కాంత్ - ఆపరేషన్ థియేటర్ లో కరెంటు పోయినప్పుడు హార్ట్ సర్జెరీ చేసిన విధానం



Tuesday, April 9, 2013

బొచ్చు కుక్క

ఇది నేను రాసిన మొదటి కవిత




నాకు ఉన్నది ఒక బుజ్జి అక్క

మేము పెంచుకుంటున్నాము ఒక బొచ్చు కుక్క

దానికి వేసాను ప్లేట్లో చికెన్ ముక్క

అది కావాలని చేయి పెట్టింది మా అక్క

కోపమొచ్చి కొరికింది మా అక్క తొక్క

నేను నవ్వాను పకపక ...


Friday, April 5, 2013

ఇప్పటివరకు మీరు చూడని బెస్ట్ కోరియోగ్రఫీ

సాంగ్ నెంబరు ఒకటి.



సాంగ్ నెంబరు రెండు




లీవ్ లెటర్



మా స్నేహితుడు ఒకడు ఒక ఇంజనీరింగ్ కళాశాల లో క్లర్క్ గా పని చేస్తున్నాడు. ఒక విద్యార్ది వచ్చి సార్ నేను ఈ కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు లీవ్ లెటర్ రాయడం రాదు మీరు కొద్దిగా చెపితే నేను రాసి ఇస్తాను అని అన్నాడు. దానికి మా స్నేహితుడు సరే అన్నాడు. లెటర్ అంతా చెప్పి ఏది ఒక సారి చూపించు అని అనే సరికి ఆ లెటర్ చదివి షాక్ కు గురయ్యాడు.
ఆ లెటర్ మీరే చదవండి.






visakhapatnam
so an so date.
To,

So and so,
Head of the so and so department,
xxx engineering college,
Visakhapatnam .

Subject : Leave application for so and so reason.

Respected sir,

I so and so, studying in your engineering college in so and so year, so and do branch, so and so roll number. Sir i am suffering from so and so problem, so please grant me leave from so and so date to so and so date. 



yours faithfully

  signature
so and so name


ఈ లెటర్ చదివి , నీవు నాకు ఎవరో తెలీదు అని so and so అని డిక్టేట్ చేస్తే ,  నేను చెప్పినట్టు అలా రాసేస్తావా అని కోప్పడి , మరలా లెటర్ రాయించాడు.  ఇది ఆ విద్యార్ది ఆంగ్ల ప్రావిణ్యం.

Tuesday, April 2, 2013

మా తమ్ముడిని ఏడ్పించిన విధానం.


చిన్నప్పుడు మా తమ్ముడుని ఏడిపించిన విధానం

ఇది 25 సంవత్సరాల క్రితం మాట.

సంఘటన ఒకటి 

ఒక రోజు నేను ఒక 5 పైసల చాక్లెట్ కొనుక్కుని తింటున్నాను. మా తమ్ముడు తనకు కూడా కావాలి అని అడిగాడు. మా ఇంటిలో నేను collect చేసిన 1 పైసా,2 పైసలు, అణా ఉండేవి. మా తమ్ముడికి ఇదిగో తమ్ముడు ఈ చాక్లెట్ ఖరీదు 5 పైసలు. ఇదిగొ రెండు 2 పైసలు, 1 పైస మొత్తం 5 పైసలు. నీ ఇష్టం చాక్లెట్ కొనుక్కున్ని ఎంజొయ్ చేస్కో అని చెప్పి కొట్టుకి పంపించాను.  పాపం అన్ని షాపులు తిరిగాడు గాని అందరూ అవి చెల్లవు అని అన్నారు. ఇంటికి వచ్చి ఏడ్చేసాడు. మా అమ్మగారు నన్ను చితక్కొడతారని నేనే వెళ్ళి మా తమ్ముడికి రెండు చాక్లేట్లు కొని శాంతపరిచాను. మెత్తానికి మా తమ్ముడిని ఏడిపించినందుకు నాకు పది పైసలు నష్టం. 

సంఘటన రెండు. 

మాకు కిరాణా సామాను కొనడానికి ఒక షాపు లో ఖాతా ఉండేది. ఆ పుస్తకం ఏంటి అని అడిగాడు. నేను ఈ పుస్తకం మన దగ్గర ఉంటే మానకు షాపు వాళ్ళు ఏమి కావాలంటే అది ఇస్తారు అని చెప్పను. దాని తను నాకు పది చాక్లేట్లు కావాలంటే ఇస్తారు అని ఆడిగాడు. ఓ ఇస్తారు అని చెప్పాను. అయితే నేను నీతొ వస్తాను అని అడిగాడు. ఓ తప్పకుండా అని అన్నాను. నేను ఒక కిలో మీటర్ దూరం నడిపించి. మా షాపు కాకుండా వేరే షాపు చూపించి నీకు ఇష్టమైనవి కొనుక్కొ అని అన్నాను. నేను దూరం నుండి చూస్తున్నాను. పాపం షాపు వాడు ఈ ఖాతా పుస్తకం ఇక్కడిది కాదు అని చెప్పి పంపించేసాడు. పాపం ఒకటే ఏడుపు. మళ్ళి నేనే నా  సేవింగ్స్ తో చాక్లెట్లు కొనాల్సి వచ్చింది. 

సంఘటన మూడు. 

ఒక రోజు నేను క్రికెట్ మాచ్ ఆడదామని మంచి షర్టు ఫాంటు వేసుకుని బయలు దేరుతున్నాను. మా తమ్ముడు చూసాడు. నేను ఎక్కడి కి వెళ్ళితే తనూ అక్కడికే వస్తానన్నాడు. నాకు మా తమ్ముడి ని తీసుకుని వెళ్ళడం ఇష్తం లేదు. ఎందుకంటె మాచ్ జరుగుతుంటే మద్యలో వెళ్ళి పోతాను అంటాడు. మళ్ళి నేనే తీసుకుని రావాళి. అందుకే ఒక అయిడియా వచ్చింది. మొత్తం ఊరు అంతా తిప్పించేసాను. ఇంటి నుండి చాల దూరం వచ్చేసాము. మా తమ్ముడికి కాళ్ళు నొప్పులు వచ్చెసాయి. ఆగిపోయాడు. మా తమ్ముడు వైపు తీక్షణం గా చూసాను. ఇప్పుడు చెప్పు నేను ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వస్తావా అని అడిగాను. అది విన్న మా తమ్ముడు కింద కూర్చుని ఏడ్చేసాడు. మళ్ళి నేనే తనను ఎత్తుకుని ఇంటికి తీసుకు వెళ్ళవలసి వచ్చింది. 


చివరికి టైటిల్ ఇలా చదువుకోవాలి   "మా తమ్ముడిని  ఏడ్పించిన  ( నేను ఏడ్చిన ) విధానం. "

Saturday, March 30, 2013

కామా తీసిన ప్రాణం


ఒక రోజు మా క్లాసు లో ఇంగ్లీష్ మాష్టారు English passage రాసుకుని రమ్మన్నారు.
మా ఫ్రెండ్ ఒకడు period comma లు ఏమి లేకుండా passage రాసాడు. punctuation marks ఏమీ లేకుండా passage రాసినందుకు మా మష్టారు గారికి చాలా కోపం వచ్చింది. దానికి ఆయన నిజం గా జరిగిన కథ ఒకటి చెప్పారు. 

పూర్వం ఇంగ్లాడు లో ఒకతను చిన్న పొరపాటు చేసినందుకు మరణ శిక్ష విదించారు. కాని మరణ శిక్ష ను రద్దు చేయడానికి రాణి గారికి విన్నవించుకున్నాడు. రాణి గారి మనసు కరిగి మరణ శిక్ష రద్దు చేయమని లెటర్ పంపించారు. కాని విచిత్రంగా అతనికి మరణ శిక్ష అమలు చేసారు. దానికి కారణం ఏమయ్యా అంటే . 

రాణి గారు తన లెటర్ చివరలో ఇలా రాసారు. 

KEEP HIM NOT, KILL HIM 

కాని ఆవిడ ఇలా రాయాలి

KEEP HIM, NOT KILL HIM


చూసారా ఒక చిన్న  , (comma)  ఒక ప్రాణాన్ని ఎలా తీసేసిందో. 




కుళ్ళి జోకులు


మా తమ్ముడు చెప్పిన జోకులు కొన్ని



జోక్ ఒకటి 

ఆకాశం లో కాకులు కొన్ని గుంపుగా ఎగురుతున్నాయి. ఇంతలో ఒక కాకి రెట్ట వేసింది. క్రింద ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. కాని విచిత్రంగా ఆ రెట్ట ఎవరి పైనా పడలేదు. ఎందుకని ?

ఎందుకంటే ఆ కాకి కట్ డ్రాయర్ వేసుకుంది.....  హ హ హ

జోక్ రెండు 

కోతుల రన్నింగ్ రేస్ జరుగుతోంది ..

అన్ని కోతులూ చాలా వేగం గా పరిగెడుతున్నాయి  . కాని ఒక కోతి మాత్రం నెమ్మదిగా నడుస్తూ ఉంది . ఎందుకని

ఎందుకంటే ఆ కోతికి హైడ్రాసిల్ ( వరిబీజం) వచ్చింది కాబట్టి ... హ.. హ .. హ..


జోక్ మూడు. 

కొన్ని కోతులు స్విమ్మింగ్ రేస్ లో పాల్గొంటున్నాయి . అన్ని కోతులు బాగానే ఈదుతున్నాయి కాని ఒక కోతి మాత్రం ఒక చేయి బయట పెట్టి ఈదుతుంది ఎందుకని ?

ఎందుకంటే ఆ కోతి పెట్టుకున్న వాచి వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి  ... హ.. హ .. హ..



జోక్ నాలుగు

మూడు కోతులు ఒక దాని వెనుక ఒకటి వెళ్తున్నాయి .

మొదటి కోతి అన్నది "నా వెనుక రెండు కోతులు ఉన్నాయి "
చివరి కోతి అన్నది "నా ముందు రెండు కోతులు ఉన్నాయి " అని
కాని మద్యనున్న కోతి మాత్రం "నా ముందు రెండు కోతులు ఉన్నాయి .... నా వెనుక రెండు కోతులు ఉన్నాయి" అని ఇదెలా జరిగింది,

ఎందుకంటే మద్యన్నున్న కోతి అబద్దం చెప్పింది .. హ.. హ.. హ...

అనుకున్నారా  ... కాదు మద్యనున్న కోతి నిజమే చెప్పింది

అసలేమి జరిగిందంటే మద్యనున్న కోతి ఒక్క సారి ఆగిపోయింది. అప్పుడు మూడో కోతి రెండో కోతిని దాతుకుని వెళ్ళి పోయింది . అప్పుడు అన్నది "నా ముందు రెండు కోతులు ఉన్నాయి "

మళ్ళి వేగంగా పరిగెత్తి రెండు కోతులని దాటి పోయి అప్పుడు అన్నది "నా వెనుక రెండు కోతులు ఉన్నాయి "

మద్యనున్న కోతి బాగా అల్లరి కోతి అనుకుంటా....







Friday, March 29, 2013

హార్డ్ వర్క్

హార్డ్ వర్క్


















చూడండి ఎంత సిన్సియర్ గా పని చేసుకుంటున్నాడో