Sunday, April 14, 2013

పావ్ లోవ్ కండిషనింగ్ రెస్పాంస్









నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను ఇంటర్నేట్ సెంటర్ నడుపుకుంటున్నాడు. చాలా మంచి మనిషి.  ఒక సారి అతను ఇంటిలో ఒక ఫంక్షన్ జరిగింది. చాలా స్వీట్లు మిగిలి పోయాయి. అతని స్నేహితుడి కూతురు ఇంటర్నెట్ సెంటర్ కి వచ్చింది. వయసు 4 సంవత్సరాలు ఉంటాయి. తను ఒక స్వీట్ ఇచ్చాడు. రేపు మరలా వస్త్తే మరొక స్వీట్ ఇస్తాను అని  చెప్పాడు. ఇల్లు దగ్గరే ఉండటం వలన రోజూ వస్తుండేది. ప్రతిరోజూ ఒక స్వీట్ ఇస్తుండేవాడు. ఒక రోజు తన దగ్గర ఉన్న స్వీట్స్ అన్ని అయిపోయాయి. ఆ అమ్మాయి వచ్చి స్వీట్ అడిగేది, మహా మంచితనం వలన షాపు లో స్వీట్ గాని చాక్లేట్ గాని కొని ప్రతిరోజూ ఇచ్చేవాడు. ఒక రోజు నేను ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్ళాను. నాకు ఈ జరిగిన విషయం అంతా చెప్పాడు. ఎలాగయినా స్వీట్ అలవాటును మాన్పించాలని అడిగాడు. ఒహ్ అదెంత అని నాకు తెలిసిన పావ్ లోవ్ ప్రవర్తనా సిద్దాంతం గురించి చెప్పాను. 

పావ్ లోవ్ అనే రష్యన్ Physiologist  ( Psychologist  కాదు) ఒక ప్రయోగం చేసి దాని ప్రకారం  ఒక ప్రవర్తనా సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక కుక్కను సబ్జెక్ట్ గా తీసుకున్నాడు.  లంచ్ టైం కి బోజనం ప్లేటు పెట్టి , ఒక గంట కొట్టేవాడు. గంట కొట్టగానే కుక్క పరిగెత్తుకుని వచ్చి ఆహారాన్ని తినేది . ఇలా చాలా రోజులు జరిగింది. గంట శబ్దం వినపడగానే కుక్క నోటిలో లాలాజలం ఊరేది.  ప్రతి సారి గంట కొట్టడం బోజనం పెట్టడం. ఇంక ఆ కుక్కకి డాక్టర్ గంట కొడితే తిండి పెడతాడని అర్థం అయిపోయింది. 

కొన్ని రోజుల తరువాత , ఆ డాక్టర్ గంట కొట్టేవాడు, కుక్క పరిగెత్తుకుని వచ్చేది. కుక్క నోటిలో లాలాజలం ఊరేది, కాని బోజనం పెట్టేవాడు కాదు. ఇలా చాలా రోజులు జరిగింది.

ఈ సారి గంట కొట్టినా కుక్క వచ్చేది కాదు. ఈ వెదవ డాక్టర్ నాకు బోజనం పెట్టడు అని అర్థం అయిపోయి ఇక వెళ్ళేది కాదు. ఇలా ప్రయోగం చేసి ప్రవర్తనా సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. 

ఈ సిద్దాంతాన్ని నేను ఆ అమ్మాయి స్వీట్లు అడగడం మాన్పించడానికి అప్లయ్ చేసాను.  ఆ అమ్మాయి వచ్చేది. స్వీటు అడిగేది. మా ఫ్రెండు ఏమి చెప్పేవాడంటే నీవు రేపు వస్తే స్వీట్ ఇస్తాను అనేవాడు. ఆ అమ్మాయి తరువాత రోజు వచ్చేంది. మరలా రేపు రమ్మనేవాడు. ఇలా చాలా రోజులు జరిగింది. పట్టు వదలని విక్రమార్కుడు లా ప్రతిరోజూ వస్తూనే ఉండేది. కాని స్వీట్ ఇచ్చేవాడు కాదు. ఆ అమ్మాయిని అలా ఏడిపించడం తప్పు అని తెలుసు కాని తప్పదు. 

కొన్ని రోజుల తరువాత రావడం మానేసింది. ఇక స్వీట్లు ఇవ్వడు అని తెలిసి. 

చాలా నెలలు తరువాత ఒకసారి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గారితో వచ్చింది. ఏమ్మా నీకు స్వీటు కావాలా అని మా స్నేహితుడు  అడిగాడు. ఆ అమ్మాయి చిరాకు మెహం పెట్టి వద్దు అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయింది. 






No comments: