Tuesday, April 2, 2013

మా తమ్ముడిని ఏడ్పించిన విధానం.


చిన్నప్పుడు మా తమ్ముడుని ఏడిపించిన విధానం

ఇది 25 సంవత్సరాల క్రితం మాట.

సంఘటన ఒకటి 

ఒక రోజు నేను ఒక 5 పైసల చాక్లెట్ కొనుక్కుని తింటున్నాను. మా తమ్ముడు తనకు కూడా కావాలి అని అడిగాడు. మా ఇంటిలో నేను collect చేసిన 1 పైసా,2 పైసలు, అణా ఉండేవి. మా తమ్ముడికి ఇదిగో తమ్ముడు ఈ చాక్లెట్ ఖరీదు 5 పైసలు. ఇదిగొ రెండు 2 పైసలు, 1 పైస మొత్తం 5 పైసలు. నీ ఇష్టం చాక్లెట్ కొనుక్కున్ని ఎంజొయ్ చేస్కో అని చెప్పి కొట్టుకి పంపించాను.  పాపం అన్ని షాపులు తిరిగాడు గాని అందరూ అవి చెల్లవు అని అన్నారు. ఇంటికి వచ్చి ఏడ్చేసాడు. మా అమ్మగారు నన్ను చితక్కొడతారని నేనే వెళ్ళి మా తమ్ముడికి రెండు చాక్లేట్లు కొని శాంతపరిచాను. మెత్తానికి మా తమ్ముడిని ఏడిపించినందుకు నాకు పది పైసలు నష్టం. 

సంఘటన రెండు. 

మాకు కిరాణా సామాను కొనడానికి ఒక షాపు లో ఖాతా ఉండేది. ఆ పుస్తకం ఏంటి అని అడిగాడు. నేను ఈ పుస్తకం మన దగ్గర ఉంటే మానకు షాపు వాళ్ళు ఏమి కావాలంటే అది ఇస్తారు అని చెప్పను. దాని తను నాకు పది చాక్లేట్లు కావాలంటే ఇస్తారు అని ఆడిగాడు. ఓ ఇస్తారు అని చెప్పాను. అయితే నేను నీతొ వస్తాను అని అడిగాడు. ఓ తప్పకుండా అని అన్నాను. నేను ఒక కిలో మీటర్ దూరం నడిపించి. మా షాపు కాకుండా వేరే షాపు చూపించి నీకు ఇష్టమైనవి కొనుక్కొ అని అన్నాను. నేను దూరం నుండి చూస్తున్నాను. పాపం షాపు వాడు ఈ ఖాతా పుస్తకం ఇక్కడిది కాదు అని చెప్పి పంపించేసాడు. పాపం ఒకటే ఏడుపు. మళ్ళి నేనే నా  సేవింగ్స్ తో చాక్లెట్లు కొనాల్సి వచ్చింది. 

సంఘటన మూడు. 

ఒక రోజు నేను క్రికెట్ మాచ్ ఆడదామని మంచి షర్టు ఫాంటు వేసుకుని బయలు దేరుతున్నాను. మా తమ్ముడు చూసాడు. నేను ఎక్కడి కి వెళ్ళితే తనూ అక్కడికే వస్తానన్నాడు. నాకు మా తమ్ముడి ని తీసుకుని వెళ్ళడం ఇష్తం లేదు. ఎందుకంటె మాచ్ జరుగుతుంటే మద్యలో వెళ్ళి పోతాను అంటాడు. మళ్ళి నేనే తీసుకుని రావాళి. అందుకే ఒక అయిడియా వచ్చింది. మొత్తం ఊరు అంతా తిప్పించేసాను. ఇంటి నుండి చాల దూరం వచ్చేసాము. మా తమ్ముడికి కాళ్ళు నొప్పులు వచ్చెసాయి. ఆగిపోయాడు. మా తమ్ముడు వైపు తీక్షణం గా చూసాను. ఇప్పుడు చెప్పు నేను ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వస్తావా అని అడిగాను. అది విన్న మా తమ్ముడు కింద కూర్చుని ఏడ్చేసాడు. మళ్ళి నేనే తనను ఎత్తుకుని ఇంటికి తీసుకు వెళ్ళవలసి వచ్చింది. 


చివరికి టైటిల్ ఇలా చదువుకోవాలి   "మా తమ్ముడిని  ఏడ్పించిన  ( నేను ఏడ్చిన ) విధానం. "

No comments: