Saturday, March 30, 2013

కామా తీసిన ప్రాణం


ఒక రోజు మా క్లాసు లో ఇంగ్లీష్ మాష్టారు English passage రాసుకుని రమ్మన్నారు.
మా ఫ్రెండ్ ఒకడు period comma లు ఏమి లేకుండా passage రాసాడు. punctuation marks ఏమీ లేకుండా passage రాసినందుకు మా మష్టారు గారికి చాలా కోపం వచ్చింది. దానికి ఆయన నిజం గా జరిగిన కథ ఒకటి చెప్పారు. 

పూర్వం ఇంగ్లాడు లో ఒకతను చిన్న పొరపాటు చేసినందుకు మరణ శిక్ష విదించారు. కాని మరణ శిక్ష ను రద్దు చేయడానికి రాణి గారికి విన్నవించుకున్నాడు. రాణి గారి మనసు కరిగి మరణ శిక్ష రద్దు చేయమని లెటర్ పంపించారు. కాని విచిత్రంగా అతనికి మరణ శిక్ష అమలు చేసారు. దానికి కారణం ఏమయ్యా అంటే . 

రాణి గారు తన లెటర్ చివరలో ఇలా రాసారు. 

KEEP HIM NOT, KILL HIM 

కాని ఆవిడ ఇలా రాయాలి

KEEP HIM, NOT KILL HIM


చూసారా ఒక చిన్న  , (comma)  ఒక ప్రాణాన్ని ఎలా తీసేసిందో. 




No comments: