Saturday, August 27, 2011

బ్లూస్క్రీన్ ఆఫ్ డెత్







నేను classroom లో క్లాసు చెబుతున్నాను. students అందరూ ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తున్నారు. ఒక అమ్మాయి తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమె నా student కూడా కాదు. excuse me sir అని పలుకరించింది. నేను బయటకు వచ్చి ఎవరు కావాలని అడిగా. సార్ మీ పేరు bhaskar కదా systems administrator కూడా కదా అని చెప్పింది. నేను అవును అన్నాను. సార్ మిమ్మలని కలవమని నాకు message పంపించారెంటి సార్ అని చెప్పింది. ఒక్కసారిగా కంగు తిన్నాను.  నేనా లేదు నేను పంపించలేదు అని చెప్పాను. లేదు సార్ మీరే పంపించారు. నేను చూడమ్మ నేను ఒక గంట నుండీ class చెబుతున్నాను    నీవేమో నేను message పంపించానంటున్నవు. అని చెప్పాను. లేదు సార్ మీరే పంపించారు  
Blue screen పైన yellow letters లో contact your systems administrator అని Message వచ్చింది అందుకే మిమ్మలను కలవడానికి వచ్చాను. 


ఆఆఆ


నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. నేను ఆమె తో ఆ system ఆపేసి పక్క system తీసుకోండి అని చెప్పాను.